BREAKING
వెల్దుర్తి సీహెచ్‌సీలో అక్టోబర్ 9న మెగా వైద్య శిబిరం: మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలచంద్రారెడ్డి జగ్గయ్యపేట మున్సిపాలిటీ పై వైస్సార్ సీపీ జెండా ఎగరడం కాయం... పీటీ ఉష 42 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ విత్య రామరాజ్ ను అభినందించిన హీరో ధనుష్! మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంపై ఏపీ కేబినెట్ కీలక తీర్మానం: చంద్రబాబు ప్రశంసలు సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ: రాజధాని భూములపై కీలక చర్చ విజయవాడలో పండుగల సందడి.. సరస్ మేళా, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌తో నగరానికి కొత్త శోభ ఆసరా కోసం.. వృద్ధురాలి అవస్థలు! పంట పండించే రైతు లేకపోతే ప్రపంచానికే మనుగడలేదు. గొట్టిపాటి లక్ష్మి నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఈ సినిమా.. 'గరివిడి లక్ష్మి' ట్రైలర్ వేడుకలో నటి ఆనంది భావోద్వేగం! ప్రజల ఆరోగ్య భద్రతకు అండగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కళాశాలకు ఇన్వర్టర్ సిస్టం బహుకరణ చింతలపూడిలో చట్టాలపై అవగాహన సదస్సు ఉరవకొండ గురుకుల పాఠశాలలో కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తనిఖీ టి. నర్సాపురంలో పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం

వేరుశనగ రైతులకు డీకార్టికేటర్‌ వరం * రైతుల శ్రమ, సమయం ఆదా చేయడమే లక్ష్యం: కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

Select Suryaa Now
వేరుశనగ రైతులకు డీకార్టికేటర్‌ వరం * రైతుల శ్రమ, సమయం ఆదా చేయడమే లక్ష్యం: కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

వేరుశనగ రైతులకు పంట అనంతర పనుల్లో డీకార్టికేటర్ యంత్రం ఎంతోఉపయోగకరంగా ఉంటుందని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. బుధవారం ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీకార్టికేటర్ యంత్రాన్ని అచ్చంపేట సబ్‌ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి ఆయన పరిశీలించారు.యంత్రం పనితీరు, సామర్థ్యం, వేరుశనగను శుభ్రపరిచి గింజలను వేరు చేసే విధానం, రైతులకు అందిస్తున్న సేవలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంట కోత అనంతరం గింజలను వేరు చేయడం, శుభ్రపరచడంలో రైతులకు గతంలో ఎక్కువ సమయం, శ్రమ అవసరమయ్యేదని, యాంత్రీకరణతో ఈ ప్రక్రియ సులభతరం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
డీకార్టికేటర్ యంత్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సమయం, శ్రమను ఆదా చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అద్దంకి సునీత , ఎంపీడీవో వరుణ్ తేజ్ ,పిఏసిఎస్ చైర్మన్ మధు నరేందర్ రెడ్డి, సీఈఓ కొత్త రవీందర్రావు , సర్పంచ్ చింతగల శ్రీనివాసులు, డిప్యూటీ తాసిల్దార్ రమేష్ నాయక్, మండల వ్యవసాయ అధికారి రమేష్ నాయక్ , వ్యవసాయ శాఖ, పీఏసీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 గణేష్ గౌడ్, ఉప్పునుంతల, సూర్య న్యూస్