వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
సూర్య సారంగాపూర్ :మండలంలోని మలక్ చించోలి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం రోజు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వన్యప్రాణుల ప్రాముఖ్యత,జీవవైవిద్య పరిరక్షణ,జీవమనగడలో వన్యప్రాణుల ప్రాముఖ్యత, తదితర అంశాలపై అవగాహన కలిగేలా,విద్యార్థులకు చిత్రలేఖనం,ఉపన్యాసం, వ్యాసరచన పోటీలు,నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అటవీ క్షేత్రాధికారి రామకృష్ణ రావు,ఉప అటవీ క్షేత్రాధికారి మహ్మద్ నజీర్ ఖాన్,ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్, సీనియర్ అసిస్టెంట్ ఇనాయతుద్దీన్,ఎఫ్బిఓ లు వెన్నెల,సుజాత అటవీ సిబ్బంది,ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.