ఉరవకొండ గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఓ.ఆనంద్ తనిఖీ
అనంతపురం బ్యూరో : ఉరవకొండ పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి క్షేమ సమాచారాన్ని, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్.. వారి ఆరోగ్య పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జ్ఞాన ప్రసన్న, విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం