BREAKING
గట్టు పై ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపులో ప్రతి నెల లక్షల రూపాయల స్కాం స్థలాల కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బంజేయ్.. సాధారణ ఆడియో లాంచ్‌కు దూరంగా జైలర్ 2 టీమ్.. ఓటీటీలో గ్రాండ్‌గా సూపర్ షో ప్రసారం! పార్టీ ఐడీ కార్డు అందుకున్న బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మైసమ్మ ఆలయ నిర్మాణానికి మల్లేశం రూ.21 వేల విరాళం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపు కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ . రికార్డు స్థాయి డిమాండ్.. అయినా నాణ్యమైన విద్యుత్ సరఫరా: భట్టి తాండూర్ కిచ్చన్నపేట సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. రైతుల వడ్ల కొనుగోళ్లకు అడ్డంకులు సృష్టించొద్దు వెల్దుర్తి సీహెచ్‌సీలో అక్టోబర్ 9న మెగా వైద్య శిబిరం: మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలచంద్రారెడ్డి జగ్గయ్యపేట మున్సిపాలిటీ పై వైస్సార్ సీపీ జెండా ఎగరడం కాయం... పీటీ ఉష 42 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ విత్య రామరాజ్ ను అభినందించిన హీరో ధనుష్! మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంపై ఏపీ కేబినెట్ కీలక తీర్మానం: చంద్రబాబు ప్రశంసలు సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ: రాజధాని భూములపై కీలక చర్చ

ప్రజల ఆరోగ్య భద్రతకు అండగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Select Suryaa Now
ప్రజల ఆరోగ్య భద్రతకు అండగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పెనమలూరు, మేజర్ న్యూస్: ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు అండగా నిలిచే లక్ష్యంతో పెనమలూరు నియోజకవర్గంలోని ముగ్గురు లబ్ధిదారులకు మొత్తం రూ.4,55,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ఎల్‌ఓసీ పత్రాలను తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు. పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ పత్రాలను లబ్ధిదారులకు అందించారు. ప్రజల అవసరాలను గుర్తించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని తమ కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అందిన సాయం ఎంతో ఊరటనిచ్చిందని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

✍️ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.