మధిర మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో కమిషనర్ సామ్యూల్ పాల్తో తో కలిసి పర్యటించిన చైర్ పర్సన్ సామినేని సుజాత
మధిర మున్సిపాలిటీ పరిధిలోని వివి వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ శ సామినేని సుజాత బుధవారం కమిషనర్ శామ్యూల్ పాల్ తో కలిసి విస్తృతంగా పర్యటించారు. వార్డులోని వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడి, స్థానికంగా నెలకొన్న సమస్యలు మరియు అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్ల నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి, ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.