BREAKING
జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్ అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ వైభవంగా దుర్గా మల్లేశ్వరుల నాల్గవ రోజు దివ్య నగరోత్సవం పెనమలూరులో నలుగురికి రూ.4.25 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం ♓ మీన రాశి (Pisces) Meena Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మీన రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం

Select Suryaa Now
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం

బంట్వారం, మేజర్ న్యూస్ (అక్టోబర్ 13):

మండల పరిధిలోని సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న లోఓల్టేజ్ విద్యుత్ సమస్య పరిష్కారానికి తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ చొరవ చూపారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్క పురుషోత్తం రెడ్డి తెలిపారు. స్పీకర్ సూచనల మేరకు సంబంధిత విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టడంతో ఆయా గ్రామాలకు 11 కేవీ విద్యుత్ లైన్ ద్వారా సరఫరా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా బక్క పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో తక్కువ వోల్టేజ్ కారణంగా ప్రజలు కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సూచించారని పేర్కొన్నారు.స్పీకర్ చొరవతో బంట్వారం విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాలకు 11 కేవీ విద్యుత్ లైన్ ద్వారా సరఫరా ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీంతో ఆయా గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.తమ సమస్యను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేసిన గడ్డం ప్రసాద్ కుమార్‌కు గ్రామస్థులు, మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చొరవ చూపడం అభినందనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సల్బత్తాపూర్ సర్పంచ్ బాలయ్య, మధ్వాపూర్ సర్పంచ్ గోరేమియా, నాయకులు రంగారెడ్డి, నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీనివాస్ గౌడ్, బంటారం, వికారాబాద్ జిల్లా.