శివాజీ నగర్‌లో ఘనంగా శివపార్వతుల కల్యాణం
సంగారెడ్డి ; శివాజీ నగర్‌లో శౌర్య యువజన సంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం అనుముల సంతోష్–సంజన దంపతుల చేతుల మీదుగా శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు, శౌర్య యువజన సంఘం సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.భక్తి భావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. అన్నదాన కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.