BREAKING
బంగ్లాదేశ్‌లో జువెనైల్ గ్యాంగుల స్వైరవిహారం.. పెరిగిపోతున్న మైనర్ల హింసాత్మక ఘటనలతో తీవ్ర సంక్షోభం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్ అర్నబ్ తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు.. పోతేరు వంతెన వద్ద నిలిచిన ఏపీ, మల్కన్‌గిరి రాకపోకలు ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా శీమకుర్తి రహదారి భద్రత పై అవగాహన నీట మునిగిన మున్సిపల్ పార్క్ కిరాయి బకాయిలతో ఈఎస్ఐ డిస్పెన్సరీకి తాళం 18 నెలలుగా రూ.15 లక్షల బకాయిలు: యజమాని కర్నాటి కృష్ణ ఎంపీటీసీ, జెడ్పీటీసీల వేతనాలు వెంటనే విడుదల చేయాలి అకాలo గా మృతి చెందిన కాకర్లముడి కుటుంబానికి బొల్లి శెట్టి లక్ష రూపాయల సాయం మామిడికుదురు మండల ప్రత్యేక అధికారిగా విజయ భాస్కర్ డీజే సౌండ్‌పై పోలీసుల కొరడా బీసీ గర్జన గోడ పత్రాల ఆవిష్కరణ రేపు ఉదయం సీపీని కలుస్తాం: అంబటి రాంబాబు గంగడ గ్రామంలో మూడు చేపల చెరువులకు గండి ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భరోసా

రిమ్స్ బాధితులకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అండగా ఉంటాయి

Select Suryaa Now
రిమ్స్ బాధితులకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అండగా ఉంటాయి

 

కలెక్టర్‌ రాజర్షి షా

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి

రిమ్స్‌ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ)లో చోటుచేసుకున్న ఘటనలో బాధితులైన చిన్నారులందరికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అండగా ఉంటాయని, అవసరమైన వైద్య సేవలు, సహాయక చర్యలు అందేలా చర్యలు చేపడుతున్నామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన ఘటనలో దురదృష్టవశాత్తు ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు కలెక్టర్‌ తెలిపారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు.
చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడిన 12 మంది చిన్నారులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. డిశ్చార్జ్‌ అయిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అవసరమైన ఫాలో-అప్‌ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిశ్చార్జ్‌ అయిన చిన్నారుల్లో ఏడుగురు మహారాష్ట్రకు చెందినవారని కలెక్టర్‌ పేర్కొన్నారు. వారి వివరాలను నాందేడ్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు అందించి, అక్కడి అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. మిగిలిన ఐదుగురు చిన్నారులు ఆదిలాబాద్‌ జిల్లాకు చెందినవారని, వారికి స్థానిక వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన వైద్య సలహాలు, సేవలు అందిస్తున్నామని వివరించారు.
ప్రస్తుతం ఎనిమిది మంది చిన్నారులు హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కలెక్టర్‌ తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన చికిత్స అందుతున్నట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు చిన్నారులు ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని సంబంధిత వైద్య బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.
బాధిత చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అండగా ఉంటాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు. నవజాత శిశువులకు మెరుగైన ఉచిత వైద్య సహాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు, నవజాత శిశువుల సంరక్షణ సేవలను మరింత పటిష్ఠం చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.