డీజే సౌండ్‌పై పోలీసుల కొరడా
డీజే సౌండ్‌పై పోలీసుల కొరడా
● డిజె పరికరాలు, టాటా ఏస్ వాహనం స్వాధీనం.. కేసు నమోదు
సూర్య కోనరావుపేట
అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తూ ప్రజలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. విధుల్లో ఉన్న పోలీసులకు అందిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ వినిపిస్తున్నట్లు గుర్తించారు.
దీంతో పోలీసులు డీజేను వెంటనే నిలిపివేసి, వినియోగిస్తున్న పరికరాలతో పాటు టాటా ఏస్ వాహనం (AP 29 TA 6445)ను స్వాధీనం చేసుకున్నారు. డీజే ఆపరేటర్, నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక శబ్దంతో డీజేలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై బండారి రామ్మోహన్ గౌడ్ హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్సై సూచించారు.