BREAKING
ఉమ్మడి ప్రాధాన్యతలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. యూరోపియన్ యూనియన్ రాయబారి కీలక ప్రకటన పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ యాక్షన్ మళ్ళీ వాయిదా పశ్చిమ బెంగాల్ యాంటీ-గుండా బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర చట్టాలతో వైరుధ్యమే కారణం బంగ్లాదేశ్‌లో జువెనైల్ గ్యాంగుల స్వైరవిహారం.. పెరిగిపోతున్న మైనర్ల హింసాత్మక ఘటనలతో తీవ్ర సంక్షోభం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్ అర్నబ్ తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు.. పోతేరు వంతెన వద్ద నిలిచిన ఏపీ, మల్కన్‌గిరి రాకపోకలు ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా శీమకుర్తి రహదారి భద్రత పై అవగాహన నీట మునిగిన మున్సిపల్ పార్క్ కిరాయి బకాయిలతో ఈఎస్ఐ డిస్పెన్సరీకి తాళం 18 నెలలుగా రూ.15 లక్షల బకాయిలు: యజమాని కర్నాటి కృష్ణ ఎంపీటీసీ, జెడ్పీటీసీల వేతనాలు వెంటనే విడుదల చేయాలి అకాలo గా మృతి చెందిన కాకర్లముడి కుటుంబానికి బొల్లి శెట్టి లక్ష రూపాయల సాయం మామిడికుదురు మండల ప్రత్యేక అధికారిగా విజయ భాస్కర్ డీజే సౌండ్‌పై పోలీసుల కొరడా

సభ విజయవంతానికి కాంగ్రెస్ సన్నాహక సమావేశం..

Select Suryaa Now
సభ విజయవంతానికి కాంగ్రెస్ సన్నాహక సమావేశం..

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గజ్జెల రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లాకు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ముస్తాబాద్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. గ్రామ స్థాయిలో ప్రజలకు సభ వివరాలను తెలియజేసి, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని గ్రామ శాఖ అధ్యక్షులకు సూచించారు.

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని, సభకు భారీగా జన సమీకరణ జరిగేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్‌రెడ్డి, చక్రధర్‌రెడ్డి, కొండం రాజురెడ్డి, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.