BREAKING
మన ఊరు మనబడి కింద మంజూరైన పాఠశాలలకు పెయింట్స్ వేయండి తిరుమలలో అనంత పద్మనాభస్వామి వ్రతం సందర్భంగా చక్రస్నానం వరద నీటితో బుగ్గ వారి వీధి మునక ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహణ టీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో అనంత చతుర్దశి వేడుకలు దరి చేరకుండా "నులి పురుగులను"నలిపెద్దాం. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు. ఉమ్మడి ప్రాధాన్యతలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. యూరోపియన్ యూనియన్ రాయబారి కీలక ప్రకటన పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ యాక్షన్ మళ్ళీ వాయిదా పశ్చిమ బెంగాల్ యాంటీ-గుండా బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర చట్టాలతో వైరుధ్యమే కారణం బంగ్లాదేశ్‌లో జువెనైల్ గ్యాంగుల స్వైరవిహారం.. పెరిగిపోతున్న మైనర్ల హింసాత్మక ఘటనలతో తీవ్ర సంక్షోభం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్ అర్నబ్ తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు.. పోతేరు వంతెన వద్ద నిలిచిన ఏపీ, మల్కన్‌గిరి రాకపోకలు ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా శీమకుర్తి రహదారి భద్రత పై అవగాహన

మామిడికుదురు మండల ప్రత్యేక అధికారిగా విజయ భాస్కర్

Select Suryaa Now
మామిడికుదురు మండల ప్రత్యేక అధికారిగా విజయ భాస్కర్

మామిడికుదురు, మేజర్ న్యూస్ : మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం సెప్టెంబర్ 23తో ముగియడంతో మామిడికుదురు మండలానికి ప్రత్యేక అధికారిని నియమించారు. అమలాపురం డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీడీఓ) విజయ భాస్కర్ను మండల ప్రత్యేక అధికారిగా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో విజయ భాస్కర్ శుక్రవారం మామిడికుదురు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో భవాని, డిప్యూటీ ఎంపీడీవోలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయ భాస్కర్ మాట్లాడుతూ.. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో మండల పరిధిలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. మండల అభివృద్ధికి సంబంధించి అన్ని వర్గాల సహకారంతో ముందుకు సాగుతామని విజయ భాస్కర్ తెలిపారు.