telanagana
సీఎం రేవంత్‌కు ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు లభించింది. కేరళలోని నిలంబూర్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దివంగత కేరళ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ అవార్డును అందిస్తోంది.