కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఆకుల ఉదయ్
సూర్య కరీంనగర్ ప్రతినిధి ::
కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆకుల ఉదయ్ నియమితులయ్యారు. అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ శుక్రవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు, వైద్యుల అంజన్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.