BREAKING
మన ఊరు మనబడి కింద మంజూరైన పాఠశాలలకు పెయింట్స్ వేయండి తిరుమలలో అనంత పద్మనాభస్వామి వ్రతం సందర్భంగా చక్రస్నానం వరద నీటితో బుగ్గ వారి వీధి మునక ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహణ టీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో అనంత చతుర్దశి వేడుకలు దరి చేరకుండా "నులి పురుగులను"నలిపెద్దాం. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు. ఉమ్మడి ప్రాధాన్యతలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. యూరోపియన్ యూనియన్ రాయబారి కీలక ప్రకటన పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ యాక్షన్ మళ్ళీ వాయిదా పశ్చిమ బెంగాల్ యాంటీ-గుండా బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర చట్టాలతో వైరుధ్యమే కారణం బంగ్లాదేశ్‌లో జువెనైల్ గ్యాంగుల స్వైరవిహారం.. పెరిగిపోతున్న మైనర్ల హింసాత్మక ఘటనలతో తీవ్ర సంక్షోభం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్ అర్నబ్ తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు.. పోతేరు వంతెన వద్ద నిలిచిన ఏపీ, మల్కన్‌గిరి రాకపోకలు ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా శీమకుర్తి రహదారి భద్రత పై అవగాహన

ఎంపీటీసీ, జెడ్పీటీసీల వేతనాలు వెంటనే విడుదల చేయాలి

Select Suryaa Now
ఎంపీటీసీ, జెడ్పీటీసీల వేతనాలు వెంటనే విడుదల చేయాలి

పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజకు మెమోరాండం అందజేసిన ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్

పెరవలి మేజర్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు దాదాపు మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని శాసన మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణతేజను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఐదేళ్ల పదవీకాలం పూర్తయినప్పటికీ, వారికి రావాల్సిన గౌరవ వేతనాలు ఇంతవరకు పూర్తిగా చెల్లించకపోవడం ఆవేదనకరమని రవీంద్రనాథ్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు బకాయిలను చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు.

రూ.100 కోట్లు అవసరం

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9,984 మంది ఎంపీటీసీలు, 660 మంది జెడ్పీటీసీలకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను చెల్లించేందుకు సుమారు రూ.100 కోట్లు అవసరమవుతాయని రవీంద్రనాథ్ తెలిపారు. ఈ మొత్తాన్ని విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం కాదని ఆయన పేర్కొన్నారు.

ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రావాల్సిన గౌరవ వేతనాలను చెల్లించడం ప్రభుత్వ బాధ్యతతో పాటు పరిపాలనా న్యాయానికి సంబంధించిన అంశమని అన్నారు.

బలహీన వర్గాలకు చెందిన వారే అధికం

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అధిక సంఖ్యలో బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారని రవీంద్రనాథ్ తెలిపారు. మహిళా ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. వీరికి రావాల్సిన గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం వారికి అండగా నిలవాలని కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో..

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో గతంలో పనిచేసిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పెండింగ్ బకాయిలను చెల్లించడం ద్వారా క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని రవీంద్రనాథ్ కోరారు.

సానుకూలంగా స్పందించిన కమిషనర్

ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అందజేసిన మెమోరాండంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. పెండింగ్ గౌరవ వేతనాల విడుదల అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు రవీంద్రనాథ్ వెల్లడించారు.