నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం: వేస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్
*సుస్త్రో ఆయిల్ కంపెనీ సహకారంతో సిఎస్ఆర్ నిధుల నుండి 75 సీసీ కెమెరాలు ఏర్పాటు
*ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్
జఫర్ ఘడ్, సెప్టెంబర్ 25 మేజర్ న్యూస్ సూర్య: నేరాల నియంత్రణ, శాంతి భద్రత పరిరక్షణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని జనగామ వేస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ అన్నారు. శుక్రవారం జఫర్ ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 14 గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన 66 సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్ లో ఏసిపి నరసయ్య, జఫర్గడ్ ఎస్ఐ రామారావు లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల నుండి సుస్త్రో ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ అధినేత సంతోష్ జగ్ధని, సిఎస్ఆర్ హెడ్ సురేష్ రెండా, జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి, పబ్లిక్ రిలేషన్ విజయ్ కుమార్ నాయక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ రాజా, హెచ్ఆర్ హెడ్ ధనవర్మ, వయా గ్రామాల సర్పంచుల సహకారంతో 25 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం మండలంలో ప్రధాన కూడళ్లలో 75 వైఫై సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సీసీ కెమెరాలు నేరస్థులకు ఒక హెచ్చరికలాగా పని చేస్తాయని, సంఘటన జరిగిన తీరును గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్రామాల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో సిఎస్ఆర్ నిద్ర నుండి సీసీ కెమెరాలు ఏర్పాటు చసిన సుప్రో కంపెనీ అధినేతను , సి ఎస్ ఆర్ హెడ్ లను ఆయన ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఉప్పుగల్ సర్పంచ్ కొడారి సాంబరాజు, తిమ్మాపూర్ సర్పంచ్ పులి సమ్మయ్య, హిమ్మత్ నగర్ సర్పంచ్ కడుదురి మమతా సోమయ్య, కోణాచలం సర్పంచ్ చంద రామా రమేష్ పోలీస్ కానిస్టేబుల్స్ తాతగారులు పాల్గొన్నారు.