BREAKING
ప్యారడైజ్ కుక్క సీన్లపై ట్రోల్స్.. రాజమౌళి మగధీరను ఉదాహరణగా చూపుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కౌంటర్! కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు

Select Suryaa Now
సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు

సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు

కామవరపుకోట, మేజర్‌న్యూస్‌ :  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప్‌ అభయాన్‌ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూపర్‌వైజర్‌ ఎం. విజయలక్ష్మి సూచనల మేరకు కామవరపుకోట 5వ అంగన్వాడీ సెంటర్‌ నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్‌ నాయకులు నూతి రాటాలు, బీజేపీ నాయకురాలు ఘంటా మాధవి హాజరయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్‌ 7వ తేదీ వరకు పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గర్భిణీ, బాలింతలకు ఇచ్చే పోషకాహారం, 7 నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు ఇచ్చే టీహెచ్ఆర్‌ గురించి, 3 - 5 సంవత్సరాల మధ్య అంగన్వాడీ కేంద్రంలో నమోదైన పిల్లలకు మధ్యాహ్న భోజన వివరాలు, పిల్లల బరువు, ఎత్తు, ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం, ప్రీ స్కూల్‌ ఆవశ్యకత గురించి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ లబ్ధిదారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

 

 సుభాష్ కామరపు కోట