మాజీ ప్రధాని, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, రామిడి రాజిరెడ్డి, సర్దార్ అమన్ జిత్ సింగ్ తదితరులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ 1991లో ఆర్థిక మంత్రిగా సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశారని, ప్రధానిగా సమాచార హక్కు, ఉపాధి హామీ, విద్యా హక్కు వంటి కీలక కార్యక్రమాలను అమలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో కాడే శంకర్, కుంభాల రాజ్‌కుమార్, అయోధ్య గౌడ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.