BREAKING
తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా

యువతలోని ప్రతిభను వెలికితీయడమే యువజన సాంస్కృతిక పోటీల లక్ష్యం

Select Suryaa Now
యువతలోని ప్రతిభను వెలికితీయడమే యువజన సాంస్కృతిక పోటీల లక్ష్యం

యువతలోని ప్రతిభను వెలికితీయడమే యువజన సాంస్కృతిక పోటీల లక్ష్యం

– జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం, మేజర్ న్యూస్: 

యువత చదువుతో పాటు కళలు, సంస్కృతి, లలిత కళలపై ఆసక్తి పెంచుకుని సాధన చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించడమే యువజన సాంస్కృతిక పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ, సెట్వెల్ పశ్చిమగోదావరి జిల్లా ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి యువజన సాంస్కృతిక పోటీలు–2026 నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో నిరంతరం సాధన చేయడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, టీమ్ స్పిరిట్ పెంపొందుతాయని అన్నారు.స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సాంస్కృతిక రంగాల్లో నైపుణ్యం ఉన్న యువత భవిష్యత్తులో ఉద్యోగాల్లోనూ సమన్వయంతో పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి తదుపరి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించడంతో పాటు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

ఐదు విభాగాల్లో పోటీలు

జిల్లా స్థాయి పోటీల్లో ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్, వీధి నాటికలు, పెయింటింగ్, వ్యాసరచన విభాగాల్లో యువతీ యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలోని యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలని కలెక్టర్ కోరారు.

ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, స్వామి వివేకానంద దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడని అన్నారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పట్టుదలతో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విజయం సాధించవచ్చని, చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ఆసక్తి ఉన్న అంశాలను ఎంచుకుని సాధన చేస్తే నైపుణ్యం సాధించవచ్చని తెలిపారు.సెట్వెల్ సీఈఓ, జిల్లా యువజన సంక్షేమాధికారి కె.ఎస్. ప్రభాకరరావు మాట్లాడుతూ, యువతలోని కళా ప్రతిభను వెలికితీయడం, సంప్రదాయ కళలను ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన సృజనాత్మక వాతావరణాన్ని కల్పించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువజనోత్సవాల ద్వారా ప్రతిభావంతులైన యువతను గుర్తించి ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.అంతకుముందు కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డా. ఎం. జగపతిరాజు, ప్రిన్సిపాల్ డా. బి.ఆర్.కె. వర్మ, యూత్ కోఆర్డినేటర్ గాదిరాజు హరీష్ వర్మ, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ భీమవరం