BREAKING
ప్యారడైజ్ కుక్క సీన్లపై ట్రోల్స్.. రాజమౌళి మగధీరను ఉదాహరణగా చూపుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కౌంటర్! కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

రేవంత్ రెడ్డి కంటపడింది..సిరిసిల్ల ప్రజల పంట పండింది!

Select Suryaa Now
రేవంత్ రెడ్డి కంటపడింది..సిరిసిల్ల ప్రజల పంట పండింది!

 

 

​- సీఎం బహిరంగ సభను లక్ష మందితో విజయవంతం చేయాలి.

- మంత్రులు శ్రీధర్ బాబు,అడ్లూరి లక్ష్మణ్ 

​-నేత కార్మికులకు అండగా నిలిచాం.

-సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరాలి

 

​ సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

​ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టి పడడంతో సిరిసిల్ల ప్రజల పంట పండిందని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో పట్టణంలోని సాయి మణికంఠ కల్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అజ్మతుల్లా హుస్సేన్, నియోజకవర్గ ఇంచార్జ్  కేకే మహేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు కటకం మృత్యుంజయం, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలమల స్వరూప, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత తదితరులు పాల్గొన్నారు.

 

-నేత కార్మికులకు అండగా నిలిచాం.

​ఈ సందర్భంగా  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి దృష్టి సిరిసిల్లపై పడిన నాటి నుంచి ఈ ప్రాంతానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరాయంగా అందుతున్నాయని తెలిపారు. నేత కార్మికుల కోసం గత ప్రభుత్వం బకాయి పెట్టిన 370 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేశామని చెప్పారు. అంతేకాకుండా 6 కోట్ల 30 లక్షల మీటర్ల ఇందిరమ్మ చీరల ఆర్డర్  అందించి నేత కార్మికులను ఆదుకున్న ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు.

 

​- బహిరంగ సభను విజయవంతం చేయాలి

 

​రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా సిరిసిల్ల ప్రాంతానికి వస్తున్నందున, నిర్వహించే బహిరంగ సభను లక్ష మందితో విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. సిరిసిల్ల నేత కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రికి తమ సంఘీభావాన్ని తెలియజేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత పాలన సాగుతోందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో సిరిసిల్ల ప్రాంతంలో శాసనసభ్యుడితో పాటు పార్లమెంటు స్థానాన్ని గెలుచుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, అందుకు ఈ బహిరంగ సభ నాంది కావాలని ఆకాంక్షించారు. నాయకుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా శ్రమించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

​

-విద్యా, ఆధ్యాత్మిక రంగాలకు పెద్దపీట

 

​ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని 250 కోట్ల రూపాయలతో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. విద్యా రంగానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తూ సిరిసిల్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్  కూడా మంజూరు చేసినట్లు వివరించారు. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.