BREAKING
తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా

రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం

Select Suryaa Now
రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం

రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం

భీమవరం, మేజర్ న్యూస్: రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. భీమవరం పేడీ రైస్ మర్చంట్ హాల్లో దిగుపాటి రాజగోపాల్ అధ్యక్షతన శనివారం ఆలిండియా లాయర్స్ యూనియన్ 11వ జిల్లా మహాసభ నిర్వహించారు.

‘అసమ్మతి–అణచివేత: న్యాయవాదుల పాత్ర’ అంశంపై రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రశ్నించే హక్కును కాపాడేందుకు న్యాయవాదులు ప్రజల పక్షాన నిలవాలన్నారు. యువ న్యాయవాదులు తీర్పులను అధ్యయనం చేసి ప్రజా సమస్యలపై పనిచేయాలని సూచించారు. న్యాయవ్యవస్థను పరిరక్షించడం అందరి బాధ్యత అన్నారు.సభాధ్యక్షుడు రాజగోపాల్ మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆలిండియా లాయర్స్ యూనియన్ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై. న్యూటన్‌తో పాటు బడుగు అశోక్‌బాబు, పాముల చిట్టిబాబు, కొవ్వూరి అప్పిరెడ్డి, శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ భీమవరం