రేకుర్తి 21వ డివిజన్ శాతవాహన యూనివర్సిటీ ఎదుట చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులు, యువత, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.