BREAKING
ప్యారడైజ్ కుక్క సీన్లపై ట్రోల్స్.. రాజమౌళి మగధీరను ఉదాహరణగా చూపుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కౌంటర్! కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

గొల్ల కురుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Select Suryaa Now
గొల్ల కురుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
 13 రూపాయలకే గొర్రెకు బీమా… రుణమాఫీకి చర్యలు
 
 పశు సంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
 
 గొర్రెలు, మేకల బీమా పథకం ప్రారంభం
 
 సూర్య కరీంనగర్ ప్రతినిధి 
 
 గొల్ల కురుమల సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పశు సంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.కరీంనగర్ జిల్లా పద్మ నగర్ లోని ఇందిరా గార్డెన్స్ లో శనివారం ఏర్పాటు చేసిన కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెలు, మేకల బీమాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గొల్ల కురుమలకు అనేక వాగ్దానాలు చేసి వారిని అభివృద్ధి చేసిన సందర్భం లేదని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులవృత్తిదారులను ప్రోత్సహిస్తుందని, వారిని అన్ని రంగాల్లో ముందుంచేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. గొల్ల కురుమలు జీవాలను మేపేందుకు నెలల తరబడి వలస వెళ్తారని, ఈ సమయంలో వారికి అనేక ప్రమాదాలు వచ్చి ఉంటాయని తెలిపారు. గొర్రెలతో పాటు పెంపకం దారులకు తగిన బీమా కల్పించేలా చూస్తామని తెలిపారు. ఏడాదికి కేవలం 13 రూపాయలు చెల్లించి ఒక గొర్రె లేదా మేకకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని తెలిపారు. మిగతా సొమ్ము ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. ప్రతి శనివారం హైదరాబాద్కు ఇతర రాష్ట్రాల నుండి వేలకొద్దీ గొర్రెలు మేకలు అమ్మకానికి వస్తాయని తెలిపారు. తెలంగాణలోనూ ఈ దిశగా పెంపకం దారులు ఉత్పత్తిని పెంచాలని సూచించారు.రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు, కులవృత్తిదారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 750 వరకు గొల్ల కురుమల సహకార సంఘాలు 3200 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. అనేకమంది సభ్యులు 55 సంవత్సరాలకు పింఛన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని తెలిపారు. కులవృత్తిదారులందరికీ 55 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాల్సిందిగా ప్రతిపాదిస్తామని తెలిపారు. ఇందిరమ్మ బీమా పథకంలో భాగంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల బీమాకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. గొర్రెల పెంపకానికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను సంఘాలకు కేటాయించాల్సిందిగా చర్యలు తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. ఎన్ సి డి సి రుణాన్ని మాఫీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ముందు ప్రతిపాదన ఉంచుతామని తెలిపారు. అలాగే కరీంనగర్లో హోల్ సేల్ మాంసం విక్రయాల మార్కెట్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కోపరేటివ్ ఫెడరేషన్ చైర్ పర్సన్ కే.సరిత తిరుపతయ్య మాట్లాడుతూ..కురుమ యాదవులు, పశు సంపద ఎక్కువగా ఉన్న కరీంనగర్ జిల్లాలో బీమా పథకం ప్రారంభించడం సంతోషదాయకమని తెలిపారు. చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గొల్ల కురుమలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. వారి రాజకీయ సామాజిక ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తామని తెలిపారు. చొప్పదండి నియోజ
కవర్గం లో ఏ అవకాశం వచ్చినా గొల్ల కురుమలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఈ సమావేశంలో యాదవ, కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, పశుగణన అభివృద్ధి చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, పశుసంవర్ధక శాఖ ఎండి సుబ్బారాయుడు, జేడీ లింగారెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షులు బాషవేని మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్ కురుమ, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.