BREAKING
తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా

అంబేద్కర్ ఆశయాలే సమాజ ప్రగతికి బాటలు

Select Suryaa Now
అంబేద్కర్ ఆశయాలే సమాజ ప్రగతికి బాటలు
కరీంనగర్ బస్‌స్టేషన్‌లో బాబాసాహెబ్ విగ్రహావిష్కరణ
 
రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత..
 
మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
 
సూర్య కరీంనగర్ ప్రతినిధి 
 
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
 
 కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం మంత్రులు ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను 2013లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్ బస్‌స్టేషన్‌కు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టినట్లు తెలిపారు. 13 ఏళ్ల తర్వాత అదే ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విగ్రహావిష్కరణకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, దొంత రాజయ్య తదితరులను అభినందించారు.
 
సమానత్వం, సామాజిక న్యాయానికి ప్రతీక
 
అంబేద్కర్ కేవలం రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు మాత్రమే కాదని, సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడంతో పాటు అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేందుకు బలమైన పునాది వేసిందన్నారు.
 
ప్రతిరోజూ వేలాది మంది రాకపోకలు సాగించే బస్‌స్టేషన్ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేకమైన విషయమన్నారు. ఈ విగ్రహాన్ని చూసే ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను, రాజ్యాంగ విలువలను గుర్తుచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. యువత అంబేద్కర్ జీవితాన్ని, ఆయన ఆలోచనలను అధ్యయనం చేయాలని సూచించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో పాటు జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
 
తెలంగాణ ప్రజాపాలనలో సామాజిక న్యాయానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత అనే మూడు ప్రధాన అంశాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.
 
మార్పు మన నుంచే రావాలి
 
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సబ్బండ వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినప్పుడే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మనలో మార్పు రాకపోతే వెనుకబాటుతనం కొనసాగుతుందని, అంబేద్కర్ చూపిన మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందని మంత్రి శ్రీహరి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందించిన అవగాహనను, ఆయన సిద్ధాంతాలను ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహాన్ని బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేయడం ద్వారా ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని నిత్యం ప్రజలకు గుర్తుచేసే అవకాశం కలిగిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూనే అంబేద్కర్ ఆశయాలను ఆచరణలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రజలకు, ముఖ్యంగా యువతకు సామాజిక న్యాయం, సమానత్వం పట్ల స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కార్పొరేషన్ చైర్మన్లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సరిత తిరుపతయ్య యాదవ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, చరణ్ కౌశిక్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రీజనల్ కార్యదర్శి దొంత రాజయ్య, కరీంనగర్ జోన్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, సెక్యూరిటీ అధికారి టి. బావ్ రావు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఎం. రవీందర్, కరీంనగర్-1 డిపో మేనేజర్ ఐ. విజయమాధురి, కరీంనగర్-2 డిపో మేనేజర్ వి. రవీంద్రనాథ్,  రీజనల్ అధ్యక్షుడు ఎన్. లచ్చిరాం నాయక్, సభ్యులు గసికంటి శంకరయ్య, బి. మల్లేశం, ఎల్. ప్రకాష్, కరీంనగర్-1 డిపో ఉపాధ్యక్షుడు రవి కిరణ్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.