BREAKING
తీర్మలపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. తెలంగాణ భక్తిని, సంస్కృతిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు రేణూ దేశాయ్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఘాటు స్పందన వెంకటరమణ హిల్స్ కాలనీలో పోటాపోటీగా గణపతి లడ్డూ వేలం పౌర్ణమి పురిష్కరించుకుని వాసవిఅమ్మ వారికి ప్రత్యేక పూజలు. డా. మన్మోహన్‌ సింగ్‌ సేవలు చిరస్మరణీయం దేశ ఆర్థిక ప్రగతికి ఆయన కృషి ఆదర్శనీయం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ రేపు బ్యాంకులు పనిచేస్తాయ్.. మారెమ్మ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.లక్ష విరాళం ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదు రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఓటరు జాబితా సవరణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన గ్రామకంఠం భూములపై సీఆర్‌డీఏ క్లారిటీ భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగ ఘన నివాళులు.... ఆర్యవైశ్యులు ఆదర్శ భావాలు కలవారు, ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. హోమ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ దంపతులు. తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం పాయింట్లపై కాక ఆహార ధరలపైనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్

వల్లూరులో ఘనంగా సేవా పక్షోత్సవం పరిశుభ్రతపై.. పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల అవగాహన మదర్ తెరిసా ట్రస్ట్ సహకారంతో.. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ శ్రమదానం

Select Suryaa Now
వల్లూరులో ఘనంగా సేవా పక్షోత్సవం  పరిశుభ్రతపై.. పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల అవగాహన  మదర్ తెరిసా ట్రస్ట్ సహకారంతో..  ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్  శ్రమదానం

వల్లూరులో ఘనంగా సేవా పక్షోత్సవం

పరిశుభ్రతపై..
పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల అవగాహన

మదర్ తెరిసా ట్రస్ట్ సహకారంతో..

ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్  శ్రమదానం


వల్లూరు మేజర్ న్యూస్

మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో మై భారత్ కేంద్రం, ఎన్‌వైకే కడప ఆదేశాల మేరకు మదర్ థెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సేవా పక్షోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినీ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ఉత్సాహంగా శ్రమదానం చేసి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో రఘురాము, డిప్యూటీ ఎంపీడీవో రమేష్, పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్, పంచాయతీ కార్యదర్శి సుబ్బారాయుడు, మదర్ థెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూటూరు విజయ్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రఘురాము మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్నారని అభినందించారు. డిప్యూటీ ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. స్వచ్ఛతపై విద్యార్థులు ప్రజల్లో అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల్లో సేవా భావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినీ విద్యార్థులు సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడం గర్వకారణమని అన్నారు. విద్యార్థులకు పుస్తక విద్యతో పాటు సమాజ సేవ, పరిశుభ్రత, క్రమశిక్షణ, మానవతా విలువలపై అవగాహన కల్పించడం పాఠశాల ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలిచేలా మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి సుబ్బారాయుడు మాట్లాడుతూ గ్రామ పరిసరాల పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు ముందుకు వచ్చి ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా ప్రజలకు చక్కటి సందేశాన్ని అందించారని తెలిపారు. మదర్ థెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూటూరు విజయ్ కుమార్ మాట్లాడుతూ సేవా భావంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమన్నారు. సమాజ సేవ, పరిశుభ్రత, మానవతా విలువలను ప్రజల్లో మరింతగా పెంపొందించేందుకు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్తులోనూ అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. విద్యార్థుల్లోని సేవా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

విద్యార్థుల శ్రమదానం ప్రత్యేక ఆకర్షణ

కార్యక్రమంలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు నరేష్, మారుతి కుమార్, రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో శ్రమదానం చేశారు. కార్యాలయాల చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.

అంతేకాకుండా పరిశుభ్రమైన పరిసరాలు -  ఆరోగ్యకరమైన జీవనం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా విద్యార్థులు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయడం, స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించడం వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. ఎన్‌సీసీ విద్యార్థులు క్రమశిక్షణతో, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు సేవా స్ఫూర్తితో, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినీ విద్యార్థులు సామాజిక బాధ్యతతో కార్యక్రమంలో పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థుల శ్రమదానం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది