పోస్టర్ ను ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్...
సూర్య కరీంనగర్
పర్యావరణ పరిరక్షణ, వ్యాధుల నివారణ, ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా ఈనెల 28న కరీంనగర్లో గ్రామ భారతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న "శాతవాహన గ్రామీణ సంత" వాల్ పోస్టర్‌ను శనివారం రోజున మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆవిష్కరించారు.విష రహిత ఆహార ఉత్పత్తిదారులు, చేతివృత్తుల వారు , వినియోగదారులకు పరస్పర తోడ్పాటును అందించే ఏకైక లక్ష్యంతో ఈ సంతను నిర్వహిస్తున్నట్టు గ్రామ భారతి బాధ్యులు తెలిపారు.సెప్టెంబర్ 28 సోమవారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకుకరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఈ సంత జరుగుతుందని తెలిపారు. మొత్తం 60 స్టాల్స్‌తో, అంచనాగా 1200 మంది వినియోగదారుల భాగస్వామ్యంతో ఈ సంత జరగనుందన్నారు.ఈ కార్యక్రమంలో డి.ఇ. వెంకటేశ్వర్లు, ఎ.ఇ. సతీష్‌తో పాటు శాతవాహన గ్రామీణ సంత రాష్ట్ర, జిల్లా కార్యకర్తలు జిన్నా సత్యనారాయణ రెడ్డి, రఘురాం రెడ్డి, నాల్యా మడుగుల శంకరయ్య, గాలిపెళ్లి నాగేశ్వరరావు, కూర్మాచలం మునీందర్, గొల్లే తిరుపతి, క్యాస మధు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.