BREAKING
ప్యారడైజ్ కుక్క సీన్లపై ట్రోల్స్.. రాజమౌళి మగధీరను ఉదాహరణగా చూపుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కౌంటర్! కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

భవనం లేక చెట్టు కిందే గ్రామసభ!

Select Suryaa Now
భవనం లేక చెట్టు కిందే గ్రామసభ!
 
 
- అసంపూర్తి పనులపై ప్రజల ఆగ్రహం
- పలు అభివృద్ధి పనులకు తీర్మానం
 
సూర్య - మానకొండూర్ :
 
సొంత భవనం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలంతా చెట్టు కింద కూర్చుని గ్రామసభ నిర్వహించిన వినూత్న సంఘటన మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం గ్రామంలో వీబీజీ రామ్ జీ గ్రామసభను నిర్వహించారు. అయితే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు సుదీర్ఘ కాలంగా అసంపూర్తిగానే నిలిచిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిలిడ నీడనే ఈ సభను జరపాల్సి వచ్చింది. దీనిపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవన నిర్మాణంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోందని, పనులను త్వరగా పూర్తి చేసి నూతన భవనాన్ని ఎప్పుడు వాడుకలోకి తెస్తారని సభ వేదికగా పంచాయతీ పాలకవర్గాన్ని నిలదీశారు. 
సదుపాయాలు లేకపోయినా చెట్టు నీడనే సాగిన ఈ సభలో గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను గుర్తించి తీర్మానాలు చేశారు. ఎస్సారెస్పీ కాలువ (కెనాల్) నుండి చెంజర్ల వరకు మట్టి రహదారి (ఫార్మేషన్ రోడ్డు) నిర్మాణం, దాడి ఐలయ్య నివాసం నుండి బంధం రహదారి వరకు, అలాగే రేవెల్లి రాజయ్య నివాసం నుండి గట్టపల్లి వరకు మట్టి రహదారుల నిర్మాణ పనులను గుర్తించారు. వీటితో పాటు ఐదు ఫారం నిధుల (ఫండ్) ద్వారా డీబీఎం 6 కాలువ నుండి స్థానిక చెరువు వరకు సాగునీటి కాలువల తవ్వకం పనులను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ కార్తీక్, పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ) సుస్మిత, జూనియర్ ఇంజనీర్ (జేఈ) అంజయ్య, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.