BREAKING
మన ఊరు మనబడి కింద మంజూరైన పాఠశాలలకు పెయింట్స్ వేయండి తిరుమలలో అనంత పద్మనాభస్వామి వ్రతం సందర్భంగా చక్రస్నానం వరద నీటితో బుగ్గ వారి వీధి మునక ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహణ టీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో అనంత చతుర్దశి వేడుకలు దరి చేరకుండా "నులి పురుగులను"నలిపెద్దాం. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు. ఉమ్మడి ప్రాధాన్యతలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. యూరోపియన్ యూనియన్ రాయబారి కీలక ప్రకటన పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ యాక్షన్ మళ్ళీ వాయిదా పశ్చిమ బెంగాల్ యాంటీ-గుండా బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర చట్టాలతో వైరుధ్యమే కారణం బంగ్లాదేశ్‌లో జువెనైల్ గ్యాంగుల స్వైరవిహారం.. పెరిగిపోతున్న మైనర్ల హింసాత్మక ఘటనలతో తీవ్ర సంక్షోభం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్ అర్నబ్ తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు.. పోతేరు వంతెన వద్ద నిలిచిన ఏపీ, మల్కన్‌గిరి రాకపోకలు ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా శీమకుర్తి రహదారి భద్రత పై అవగాహన

ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భరోసా

Select Suryaa Now
ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భరోసా

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రెవెన్యూ, భూ వివాదాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వినతులను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని త్వరితగతిన పరిశీలించి, సంబంధిత అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, శివాలయం చైర్మన్ వంగల నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్ కాకుమాని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.