BREAKING
ఆదర్శభావాల కలిగిన వారు ఆర్యవైశ్యులు ఇన్-సర్వీస్ టెట్-2 ప్రతిభ చాటిన వి. భరత్ బాబు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించకపోవడంపై పలువురు అసంతృప్తి హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ తీర్మలపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. తెలంగాణ భక్తిని, సంస్కృతిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు రేణూ దేశాయ్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఘాటు స్పందన వెంకటరమణ హిల్స్ కాలనీలో పోటాపోటీగా గణపతి లడ్డూ వేలం పౌర్ణమి పురిష్కరించుకుని వాసవిఅమ్మ వారికి ప్రత్యేక పూజలు. డా. మన్మోహన్‌ సింగ్‌ సేవలు చిరస్మరణీయం దేశ ఆర్థిక ప్రగతికి ఆయన కృషి ఆదర్శనీయం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ రేపు బ్యాంకులు పనిచేస్తాయ్.. మారెమ్మ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.లక్ష విరాళం ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదు రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఓటరు జాబితా సవరణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన గ్రామకంఠం భూములపై సీఆర్‌డీఏ క్లారిటీ భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగ ఘన నివాళులు....

గంగడ గ్రామంలో మూడు చేపల చెరువులకు గండి

Select Suryaa Now
గంగడ గ్రామంలో మూడు చేపల చెరువులకు గండి

 

*భారీగా లభ్యత నష్టం, రూ. 1.90 లక్షల మేర నష్టం*

​బలిజిపేట, సెప్టెంబర్ 24 మేజర్ న్యూస్.... పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు మత్స్య శాఖ అధికారులు చేపట్టిన ప్రాథమిక సర్వేలో బలిజిపేట మండలం గంగడ గ్రామంలో భారీగా మత్స్య సంపద నష్టపోయినట్లు తెలిసింది. ​గ్రామంలోని బొబ్బిలి ఫిషర్‌మెన్ సొసైటీ పరిధిలోకి వచ్చే హుస్సేన్‌ఖాన్ చెరువు, సిమ్మి నాయుడు చెరువు, వల్లభనాయుడు చెరువు అనే మూడు మత్స్య శాఖ చెరువులకు పూర్తిగా గండి పడింది. ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 67.22 హెక్టార్లు కాగా, అందులో నీటి వినియోగ విస్తీర్ణం 23.86 హెక్టార్లుగా ఉంది. ​చెరువులకు తీవ్రమైన గండి పడటంతో సుమారు 47,720 అడ్వాన్స్డ్ చేపపిల్లలు కొట్టుకుపోయాయని, దీనివల్ల రూ. 1,90,880 మేర నష్టం వాటిల్లిందని జిల్లా మత్స్య శాఖ అధికారి సంతోష్ అంచనా వేశారు.
​ఈ బొబ్బిలి ఫిషర్‌మెన్ సొసైటీలో మొత్తం 435 మంది సభ్యులు ఉండగా, గంగడ గ్రామంలో 11 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. చెరువులకు గండి పడటంతో స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అధికారులు త్వరితగతిన స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామానికి చెందిన మత్స్యకారులు కోరుతున్నారు.