BREAKING
దోర్నాలకు త్వరలో అన్నా క్యాంటిన్… స్వచ్ఛ అవార్డ్ గ్రహీత గ్రామ కార్యదర్శి కి ఘన సన్మానం ఓబీసీల సింహగర్జనకు తరలి రావాలి 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి శివాజీ పార్క్ నిరసనలో షబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా: ఓటర్ల జాబితా అక్రమాలపై సీజేపీ ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు, నిర్వాహకులపై కేసు నమోదు దురద కుంటలో ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంతం, మల్లాపురంలో వాయిదా. కొత్త ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన గౌస్ మోహిద్దీన్, పార్లమెంటు ఆర్థిక కమిటీ పునర్వ్యవస్థీకరణ: వరుసగా కమిటీ ఛైర్మన్‌గా భర్తృహరి మహతాబ్, సభ్యులుగా చిదంబరం, ప్రఫుల్ పటేల్, గౌరవ్ గొగోయ్ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కిడ్నీ వ్యాధి బాధితుడికి ఆర్థిక సహాయం. సేవా రంగంలో విశిష్ట సేవలకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులకు ఘన సన్మానం చికెన్ లివర్, మటన్ లివర్ తరచుగా తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలతో పాటు పొంచి ఉన్న ముప్పులివే! గిద్దలూరు మండలంలో అంగన్వాడి వారోత్సవాలు చట్టాలపై అవగాహన ఉండాలి-ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి స్మిత్ మచ్చర్ సాహసం దేశకీర్తిని పెంచింది -- త్వరగా కోలుకోవాలని ప్లా కార్డులతో ప్రదర్శన

ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి : దిశ సమావేశంలో ఎంపీ డీకే అరుణ

Select Suryaa Now
ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి : దిశ సమావేశంలో ఎంపీ డీకే అరుణ

నారాయణపేట, సూర్యన్యూస్: 
రైతులు, మహిళలు, విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్ డీకే అరుణ సూచించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ కమిటీ సమావేశానికి ఎంపీ  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రియాంకతో పాటు వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి   సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల లక్ష్యాలను సాధించే విధంగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. పథకాల అమలును క్షేత్రస్థాయి వరకు పకడ్బందీగా తీసుకెళ్లడంతో పాటు నిర్ణీత గడువులో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా తదుపరి అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు, అదనపు నిధులు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

*పీఎండీకేవై ప్రథమ స్థాయి అవార్డు*
వ్యవసాయ రంగంలో ప్రధానమంత్రి పీఎండీకేవై కార్యక్రమం కింద నారాయణపేట జిల్లాకు ప్రథమ స్థాయి అవార్డు లభించడం అభినందనీయమని పేర్కొంటూ, ఇందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగాన్ని ఎంపీ అభినందించారు. ఇదే స్ఫూర్తితో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలపాలని ఆకాంక్షించారు. నారాయణపేటను ఆస్పిరేషనల్ జిల్లాగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

*ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని కొనసాగించాలి*
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనుల ప్రారంభ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని సమన్వయంతో కొనసాగించాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకట్ రాములు జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన, కొనసాగుతున్న పనుల వివరాలను వివరించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన రహదారి పనులపై ఈఈ అశోక్ వివరాలు సమర్పించారు.
ఆస్పిరేషనల్ బ్లాక్ నర్వ మండలంలో సూచికల ఆధారంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయకర్త బాలాజీ వివరించారు. నర్వ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల అవసరాన్ని ఎంపీ దృష్టికి తీసుకురాగా, దీనిపై అవసరమైన చర్యలు పరిశీలించాలని సూచించారు.

*భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంపై ఆరా*
భారత్‌మాల ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపులపై ఎంపీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 600 ఎకరాల్లో 1,500 మంది రైతులు ఉండగా, సుమారు 150 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్డీవో రమేష్ తెలిపారు. రూ.217 కోట్ల నష్టపరిహారానికి గాను రూ.184 కోట్లు చెల్లించినట్లు వివరించారు. నష్టపరిహారం రేటు తక్కువగా ఉందన్న కారణంతో కొందరు రైతులు పరిహారం స్వీకరించలేదని తెలిపారు. సేకరించిన భూమికి నిబంధనల ప్రకారం నష్టపరిహారం తప్పనిసరిగా చెల్లిస్తున్నట్లు జాతీయ రహదారుల శాఖ అధికారి వివరించారు. భూసేకరణలో ఉన్న సమస్యలను పరిష్కరించి పనులను ముందుకు తీసుకెళ్లాలని, రైతులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు.

*పీఎం సూర్యఘర్ పథకంపై విస్తృత ప్రచారం చేపట్టాలి*
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 151 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని విద్యుత్ శాఖ ఎస్‌ఈ నవీన్ తెలిపారు. వీటిలో 49 సర్వీసులు విడుదల కాగా, 162.32 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటయ్యాయని వివరించారు. సర్వీసులు పొందిన 49 మంది లబ్ధిదారులు సబ్సిడీకి అర్హత పొందినట్లు తెలిపారు. పీఎం-కుసుమ్ పథకం కింద 24 ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించగా, వాటిలో 3 ప్రాజెక్టులకు అనుమతులు లభించినట్లు వివరించారు. గిరిజన తండాల్లో అన్ని నివాసాలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయా అనే అంశంపై ఎంపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

*అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి*
జిల్లాలో మైనింగ్ ద్వారా సమకూరుతున్న ఆదాయం, ఇసుక రవాణాకు ఇస్తున్న అనుమతులపై ఎంపీ వివరాలు కోరారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొంటూ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఇళ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పీఎంశ్రీ పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 పనుల్లో 7 పనులు పూర్తయ్యాయని, 8 పనులు పురోగతిలో ఉన్నాయని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. ఫేజ్-1లోని 15 పనుల్లో 8 పనులు పూర్తయ్యాయని, ఒక పని ప్రారంభం కావాల్సి ఉందని, త్వరలోనే ఆ పనిని ప్రారంభిస్తామని వివరించారు.

*పెండింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలి*
ఉట్కూర్ మండలం వల్లంపల్లి రోడ్డు నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని పీఆర్‌ఈఈ అశోక్‌ను ఎంపీ ఆదేశించారు. మక్తల్ - నారాయణపేట రోడ్డు పనుల ప్రారంభంపై కమిటీ సభ్యులు అడగగా, పనులు ప్రారంభమయ్యే వరకు రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకట రమణయ్యను ఆదేశించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద జిల్లాలో నిర్మిస్తున్న, నిర్మించాల్సిన రహదారుల వివరాలను పీఆర్‌ఈఈ అశోక్ వివరించారు. జిల్లాలో అటవీ శాఖ పరిధిలోని నర్సరీలు, నాటిన మొక్కల వివరాలను అటవీ శాఖ అధికారి వివరించారు. తిరుమలపూర్ వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులపై పరిశీలించాలని ఎంపీ సూచించారు.
నారాయణపేట మున్సిపాలిటీలో అమృత్ పథకం కింద చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

*వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు*
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఆసుపత్రిలో 6,500 ఇన్‌పేషెంట్ కేసులు నమోదయ్యాయని, అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సుమారు 4,000 శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు.
సాంకేతిక, సాంకేతికేతర విభాగాల్లో 34 కేటగిరీలకు సంబంధించి 154 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తయిందని, త్వరలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తామని వివరించారు.

*సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చాలి*
న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్‌లో భాగంగా జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా వయోజన విద్య ఇన్‌చార్జి శ్రీనివాస్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూరుస్తున్నాయని వివరించారు. 2025–26 సంవత్సరానికి రూ.4,02,632 నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మార్చి 29న నిర్వహించిన  పరీక్షకు 18,062 మందిని నమోదు చేయగా, 8,172 మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. సెప్టెంబర్ 27న నిర్వహించిన రెండో దశ పరీక్షకు 24,665 మందిని లక్ష్యంగా నిర్దేశించగా, 17,800 మంది హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత రేటు 49.93 శాతం, మహిళల అక్షరాస్యత రేటు 39.72 శాతంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు  తెలిపారు.

*శాఖల వారీగా చేపట్టిన పనుల సమాచారం సేకరణ*
సమావేశంలో జిల్లా పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ, గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్, విద్యా శాఖ, డీడబ్ల్యుఓ, ఎస్సీ అభివృద్ధి, ఆర్ డబ్లు ఎస్, పౌర సరఫరాల శాఖ, నాబార్డు, మైనింగ్ శాఖ, పశు సంవర్ధక, మత్స్యశాఖ, భూగర్భ జల వనరుల శాఖ, చీఫ్ ప్లానింగ్, ఉద్యాన శాఖ, ఇరిగేషన్, కార్మిక శాఖ, నేషనల్ హైవే,ఆర్&బి శాఖల ద్వారా చేపట్టిన పనుల గురించి ఆయా శాఖల అధికారులు క్లుప్తంగా వివరించారు.
-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*