దురద కుంటలో ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంతం, మల్లాపురంలో వాయిదా.
దురుదుకుంటలో ప్రశాంతంగా ఎస్ఎంసీ ఎన్నికలు
మల్లాపురంలో మరోసారి వాయిదా
కళ్యాణదుర్గం: మండలంలోని దురుదుకుంట, మల్లాపురం గ్రామాల్లో వాయిదా పడిన ఎస్ఎంసీ ఎన్నికలు శనివారం జరిగాయి.
దురుదుకుంటలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
మల్లాపురంలో మాత్రం ఎన్నికల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కళ్యాణదుర్గం రూరల్ సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలను కాపాడారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అధికారులు, సిబ్బంది తగిన చర్యలు చేపట్టారు.