స్మిత్ మచ్చర్ సాహసం దేశకీర్తిని పెంచింది -- త్వరగా కోలుకోవాలని ప్లా కార్డులతో ప్రదర్శన
నారాయణపేట, సూర్యన్యూస్: విమానంలో ఉగ్రవాదుల కుట్రలను సాహసంతో ఎదుర్కొని ప్రాణాలకు తెగించి170 ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ శనివారం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫ్లా కార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు విజయ మాట్లాడుతూ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరి ప్రాణాలను కాపాడడమే అంతిమ లక్ష్యంగా కృషిచేసిన స్మిత్ మచ్చర్ సాహసం భారతదేశ కీర్తిని పెంచిందని అన్నారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని, తిరిగి ప్రజా సేవలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మధుసూదన్ రావు, భాను ప్రకాష్, మంగళ, లక్ష్మణ్, ప్రతాప్, నరసింహ, రఘురాం రెడ్డి, నిర్మల, శశిరేఖ, వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
-- *రాజేష్ కుమార్ సూర్య రిపోర్టర్ నారాయణపేట*