BREAKING
కట్టరాంపూర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన మీరు ఉద్యోగం తో పాటు వ్యాపారం చేయాలనుకుంటున్నారా ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలందిచడమే ఏపీఎన్.ఆర్.టి లక్ష్యం ఈనెల 13న దళితుల దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 5న ప్రజావాణి కార్యక్రమం రద్దు •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అందమే తనకు శాపమైంది.. చేతికొచ్చిన సినిమాలను కోల్పోయాను: నటి దియా మీర్జా కోటపల్లి మార్కెట్ చైర్‌పర్సన్‌గా రమావత్ అనితాబాయి రమేష్ ఎన్టీఆర్ కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు.. కానీ ఆ సినిమా నాకు నచ్చలేదు: దర్శకుడు కృష్ణవంశీ వత్సవాయిలో టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరిన ముస్లిం మైనార్టీ కుటుంబాలు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే నేను సన్నీ లియోన్ లాంటివాడిని.. ఇక దాచడానికి ఏమీ లేదు: జ్యోతిష్కుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ప్రజా దర్బార్ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్న టీజీఎస్పీడీసీఎల్ కూటమి పాలనలో జీ అగ్రహారానికి మహర్దశ రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

కండ్లకోయలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
కండ్లకోయలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం
గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్

మేడ్చల్, మేజర్ న్యూస్( అక్టోబర్ 3):
గుండ్లపోచంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్ కండ్లకోయలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ అధికారి లక్ష్మీకాంత్, రేషన్ డీలర్ లావణ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బొక్క శ్రీకాంత్ రెడ్డి, కర్రోలా సంతోష్ తదితరులు హాజరయ్యారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ....పేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కండ్లకోయ మాజీ సర్పంచులు కందాడి నరేందర్ రెడ్డి, కర్రోల్ల స్వామి, మేడ్చల్ ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గువ్వ రవి ముదిరాజ్, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గోమారం రమణారెడ్డి, మేడ్చల్ సొసైటీ మాజీ డైరెక్టర్ దామనగారి నరహరి, కండ్లకోయ మాజీ ఉపసర్పంచ్ చిల్ల వెంకటేష్ ముదిరాజ్, రాజేందర్ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాకార బోయిన మల్లేష్ ముదిరాజ్, వీరస్వామి, వెంకట్ ముదిరాజ్, బొక్క కృష్ణారెడ్డి, కందాడి సందీప్ రెడ్డి, గుండ్లపోచంపల్లి డివిజన్ సేవాదళ్ అధ్యక్షుడు చిల్ల సాయి ముదిరాజ్, శ్రీనివాస్, శివ ముదిరాజు, శ్రీకాంత్ ముదిరాజు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ తలారి శివకుమార్.