BREAKING
గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ అరాఫ్తా షూటింగ్ అనుభవాలు పంచుకున్న టర్కిష్ నటులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి ఫ్లైదుబాయ్ పైలట్ సాహసాన్ని కొనియాడిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ గోవింద నామ స్వర్ణతో మారుమోగిన వెంకటనారాయణ నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డీప్‌‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు రైతులకు తమిళనాడు ప్రభుత్వం కొండంత అండ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక మాజీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో ఆర్‌బీఓఎల్ సీఈవో జాతీయస్థాయిలో సత్తా చాటిన ఉమామహేశ్వరపురం విద్యార్థిని. దళిత ఉప సర్పంచ్ పై దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు దళిత, బహుజన సంఘాల ధర్నా పేరూరు గురుకులంలో ఆధునిక హంగులు పేదలకు ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి కండ్లకోయలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ

Select Suryaa Now
విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ

కందుకూరు మండలంలో విద్యార్థులకు  ఎన్ఎంఎంఎస్  మెటీరియల్ పంపిణీ

కందుకూరు మండలంలోని కందుకూరు బాలికల పాఠశాలతో పాటు నేదునూరు, పులిమామిడి, గూడూరు, రాచులూరు, కురుమిద్దె గ్రామాల్లోని జెడ్ పి హెచ్ ఎస్  పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో ఎన్ఎంఎంఎస్  మెటీరియల్ పరీక్షా మెటీరియల్‌ను వాలంటీర్ మొగిళ్ల శ్రీకాంత్ అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు ఎన్ ఎం ఎం ఎస్  పరీక్షకు హాజరై మెరిట్ సాధిస్తే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నెలకు రూ.1,000 చొప్పున స్కాలర్‌షిప్ పొందవచ్చని తెలిపారు. పరీక్ష విధానం, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యూత్ ఫర్ సేవా వాలంటీర్లు ఎలిమినేటి ప్రవీణ్, ఢిల్లీ అనిల్, ప్రవీణ్ రెడ్డి, కొలికిచర్ల అభిలాష్, తిక్కల మణికుమార్ (మై భారత్ వాలంటీర్) తదితరులు పాల్గొన్నారు.

తోకల శ్రీనివాస్: మేజర్ న్యూస్ కందుకూరు