సేవా రంగంలో విశిష్ట సేవలకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులకు ఘన సన్మానం
నారాయణపేట, సూర్య న్యూస్:
గాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సేవా రంగంలో విశిష్ట సేవలు అందించిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నారాయణపేట జిల్లా శాఖ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన బాపూ బాట కార్యక్రమంలో భాగంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరసింహారావు సగరి, ప్రధాన కార్యదర్శి యశ్వంత్ లాండ్గే, ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్, కోశాధికారి శ్రీనివాస్ ధోత్రి, మీడియా ఇన్‌చార్జి దుబాయ్ వెంకటరాములు సేవా రంగంలో అందించిన విశిష్ట సేవలను గుర్తించి ప్రశంసాపత్రాలతో సత్కరించారు.
-- *రాజేష్ కుమార్ సూర్య రిపోర్టర్ నారాయణపేట*