ఓబీసీల సింహగర్జనకు తరలి రావాలి
ఓబీసీల సింహగర్జనకు తరలిరావాలి
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాణా ప్రతాప్‌రెడ్డి పిలుపు
శంషాబాద్ మండలం గొల్లపల్లిలో నేడు మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న ఓబీసీ సింహగర్జన కార్యక్రమానికి కందుకూరు మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఓబీసీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మండల అధ్యక్షుడు రాణా ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం కోసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొక్క భూపాల్ రెడ్డి, ఎం డి అఫ్జల్ బేగ్, పాండు రంగారెడ్డి, జాపాల బలరాం, గాదె కుమార్, దర్శన్, ఎగ్గిడి జగదీష్, గడేల అనిల్, సుధాకర్, పవన్, సురేష్, రంజిత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- తోకల శ్రీనివాస్: మేజర్ న్యూస్, కందుకూరు