34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
అమలాపురం మేజర్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనలు హైకోర్టు తీర్పుతో ప్రశ్నార్థకంగా మారాయని మాజీ ఎంపీ చింతా అనురాధ విమర్శించారు.
బీసీలకు నిజంగా న్యాయం చేయాలంటే న్యాయస్థానాల్లో నిలిచే విధంగా అవసరమైన డేటా, చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు... రిజర్వేషన్ల పేరుతో రాజకీయ ప్రచారం చేయడం కాకుండా, బీసీలకు చట్టబద్ధమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నారు…
34 శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారు? స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారు? అనే ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని చింతా అనురాధ కోరారు.