BREAKING
'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య నాణ్యమైన తాగునీరందించడమే లక్ష్యం.. 13 వ వార్డు లోనాగవంశం కులస్తులకు వైసిపి టికెట్ కేటాయించాలి

వీక్లీ పరేడ్ తో దేహదారుఢ్యం, సామర్థ్యం పెంపు : ఆర్ఐ విజయ్ భాస్కర్

Select Suryaa Now
వీక్లీ పరేడ్ తో దేహదారుఢ్యం, సామర్థ్యం పెంపు : ఆర్ఐ విజయ్ భాస్కర్

నారాయణపేట, సూర్యన్యూస్ :;నారాయణపేట జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్‌ను ఆర్ ఐ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది పరేడ్‌లో భాగంగా  మార్చ్‌పాస్ట్, డ్రిల్, శారీరక వ్యాయామాలు నిర్వహించారు. అనంతరం ఆర్ఐ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ... పోలీస్ శాఖలో విధులు నిర్వహించే ప్రతి సిబ్బందికి క్రమశిక్షణ, దేహదారుఢ్యం, సమయపాలన ఎంతో ముఖ్యమని తెలిపారు. వీక్లీ పరేడ్ ద్వారా సిబ్బందిలో శారీరక సామర్థ్యంతో పాటు మానసిక దృఢత్వం, సమన్వయం, క్రమశిక్షణ పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ పరేడ్ వల్ల పోలీస్ సిబ్బంది నిరంతరం ఫిట్‌గా ఉండటంతో పాటు విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులపై ఉన్న బాధ్యతను గుర్తించి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ప్రతిరోజూ శారీరక వ్యాయామం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ లు శివ శంకర్, శిరీష, ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*