కొత్త ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన గౌస్ మోహిద్దీన్,
మార్కాపురం, మేజర్ న్యూస్. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పార్టీలకతీతంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు నూతన ఎస్పీని కలిసిన వైసిపి మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పంకజ్ కుమార్ మీనా కు ఆయన కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. న్యాయం కోసం పేద ప్రజలు అట్టడుగు వర్గాలు కన్నెత్తి చూసేది పోలీసు శాఖ వైపేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారూ. అందుకే పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పార్టీలకు అతీతంగా పనిచేస్తారని ఆయన వెల్లడించాడు. మీరు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని తమకు నమ్మకం ఉందని జిల్లా కొత్త ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే మంచి అధికారిగా మీరు పేరు తెచ్చుకుంటారన్న నమ్మకం తమకు జిల్లా ప్రజలకు ఉందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.