BREAKING
'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య నాణ్యమైన తాగునీరందించడమే లక్ష్యం.. 13 వ వార్డు లోనాగవంశం కులస్తులకు వైసిపి టికెట్ కేటాయించాలి

చేవెళ్లలో MSF హడావిడి.. అక్టోబర్ 6న ‘ఛలో OU’ పిలుపు

Select Suryaa Now
చేవెళ్లలో MSF హడావిడి.. అక్టోబర్ 6న ‘ఛలో OU’ పిలుపు

ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కో-ఇంచార్జి నాని భానుప్రసాద్ మాదిగ పిలుపునిచ్చారు. అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే సభకు భారీగా తరలిరావాలని కోరారు.
చేవెళ్లలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాలు బలహీనంగా ఉన్న ఈ సమయంలో ఎంఎస్ఎఫ్‌ను బలోపేతం చేసి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందన్నారు. డిగ్రీ, పీజీ, జూనియర్ కళాశాలల్లో కొత్త కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని శక్తివంతం చేయాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలు పూర్తి స్థాయిలో అందుకునేందుకు మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని పేర్కొన్నారు. కుల వివక్షత, పేదరికం లేని సమాజ నిర్మాణానికి బలమైన ప్రజా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

(చేవెళ్ల - మేజర్ న్యూస్)