చట్టాలపై అవగాహన ఉండాలి-ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి
సిఎస్ పురం,మేజర్ న్యూస్: సమాజంలో ప్రతిఒక్కరు ప్రభుత్వ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి సమాజాభివృద్ధికి కృషిచేయాలని ఎస్ఐ పి.వెంకటేశ్వరరెడ్డి అన్నారు.శనివారం మండలంలోని అంబవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఈగల్ క్లబ్ నిర్వాహణ సైబర్ నేరాలు మత్తుపదార్ధాల నిర్మూలన చట్టవ్యతిరేక కార్యకలాపాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాలపై యస్ఐ అవగాహన కల్పించి యువత చెడువ్యసనాలకు బానిసలు కావద్దని మంచి అలవాట్లు నేర్చుకోవాలని పెద్దలపట్ల మహిళల పట్ల ప్రత్యేక గౌరవం కలిగి మంచి సత్ప్రవర్తనతో సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.ఈసందర్భంగా ఈగల్ క్లబ్ అధ్వర్యంలో నిర్వహించిన కాంపిటీషన్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.ఈకార్యక్రమంలో యస్ఐ వెంకటేశ్వరరెడ్డి,హెచ్ యం షరీఫ్,హ్యూమన్ రైట్స్ ప్రతినిధి షేక్ గౌస్ బాషా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.