ప్రపంచ దేశాల పతాకాల సాక్షిగా.. అంతర్జాతీయ వేదికపై ఒంగోలు ఆత్మగౌరవం!
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ప్రపంచంలోని వివిధ దేశాల జాతీయ పతాకాల మధ్య భారత త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతున్న అంతర్జాతీయ వేదికపై ఒంగోలు నగర మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప గారు!
ముంబైలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ మేయర్ల సదస్సు, 7వ ఆసియా నగరాల సదస్సు రెండో రోజు సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులు, ప్రపంచ నగరాల మేయర్ల సమక్షంలో భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు, మన ఒంగోలు నగరానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణం.
దేశాల సరిహద్దులు వేరైనా.. అభివృద్ధి లక్ష్యం ఒక్కటే అనే స్ఫూర్తితో ప్రపంచస్థాయి వేదికపై నగరాభివృద్ధి ఆలోచనలు, అంతర్జాతీయ అనుభవాలను తెలుసుకుంటూ ఒంగోలు నగర ప్రతిష్ఠను చాటుతున్న శ్రీ శిల్ప గారి ఈ ప్రాతినిధ్యం అభినందనీయం.
ఒక నగరానికి మేయర్‌గా బాధ్యతలు చేపట్టి.. ప్రపంచ దేశాల ప్రతినిధుల వేదికపై ఒంగోలు పేరు వినిపించడం నిజంగా గర్వించదగ్గ విషయం!
???????? మన భారత త్రివర్ణ పతాకం సాక్షిగా.. అంతర్జాతీయ వేదికపై ఒంగోలు కీర్తి పతాకం!