ఓటేరులో సర్పంచ్ గా ధనలక్ష్మీ యాదవ్‌ను గెలిపించండి
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతు దారు ధనలక్ష్మీయాదవ్‌ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్థానిక నేతలకు సూచించారు. విభేదాలను విడిచిపెట్టి పార్టీ నియమించిన అభ్యర్థులను గెలిపించాలని, అభ్యర్థులకు నష్టం కలిగించేలా ఎవ్వరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంతకు ముందు చెవిరెడ్డిపై పూలవర్షం కురిపించిన ఓటేరు ప్రజలు చెవిరెడ్డి సాయం ఎన్నటికీ మరచిపోలేమని వెల్లడించారు. ఆ తరువాత మాజీ సర్పంచ్ లక్ష్మీ రాజాతో పాటు స్థానిక నేతలు అందరూ ఆమె విజయానికి ప్రచారం నిర్వహించారు.
H. Dwaraka, staff reporter
9705347341