మేదరల అభివృద్ధికి కృషి చేస్తా :చైర్మన్ మారెళ్ళ
సత్తెనపల్లి, మేజర్ న్యూస్ : మేదర సామాజిక వర్గ ప్రజలు నాకు అత్యంత ఆప్తులని, వారికి ఏ ఇబ్బంది వచ్చిన అందుబాటులో ఉంటానని, వారి అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ మారెళ్ళ రామాంజనేయులు అన్నారు. గురువారం పట్టణ మేదరి సంఘం ఆధ్వర్యంలో నూతన పురపాలక సంఘం చైర్మన్ గ మారేళ్ల రామాంజనేయులు, 24 వ వార్డు కౌన్సిలర్ సిరిగిరి మణికంఠ, 25 వార్డు కౌన్సిలర్ జొరిగే జ్యోతి శ్రీనివాస్, 26 వార్డ్ కౌన్సిలర్ అంగులూరి జయంతి లను ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మారేళ్ల రామాంజనేయులు మాట్లాడుతూ మెదరలకు ఎప్పుడు అవసరమైన నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కౌన్సిలర్లు మాట్లాడుతూ మేదరి కులస్తులు నివసిస్తున్న వార్డులో ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావచ్చు అని మేము కచ్చితంగా పరిష్కరించగలమని చెప్పినారు. ఈ కార్యక్రమంలో మేదరి సంఘం పెద్దలు, మేదరి సంఘం జిల్లా ప్రెసిడెంట్ జోరిగే శ్రీనివాసరావు,జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటేశ్వరరావు, తుమ్మల ఏడుకొండలు, జొరిగే కోటేశ్వరరావు, జొరిగే సుబ్బారావు, తుమ్మల నాగప్రసాద్, పిల్లి హనుమంతరావు, చందా సోమయ్య, పట్టణ మేదరి సంఘం అధ్యక్షులు తుమ్మల శ్యాం కుమార్, చందా ఆంజనేయులు, తుమ్మల శ్రీపతి,తుమ్మల. వెంకటేష్ జోరిగే.భాను, చందా భార్గవ్ మరియు పట్టణ కమిటీ సభ్యులు, మహిళలు యువకులు మేదరి సంఘం ప్రతి ఒక్కరూ పాల్గొని వారికి సన్మాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడమైనది.
గన్నవరం ఏలియ