రాజ్యాంగ ఆశయ సాధనకు కృషి చేద్దాం : ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను, ఆయన కలలుగన్న సమానత్వ సమాజాన్ని సాధించేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. గురువారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్వీయూ ఎదుటగల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని చదివి హక్కులపై అవగాహన పెంచుకోవాలి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రశ్నించే గొంతుకలుగా మారాలని సూచించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించాలంటే ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలని, విద్య ద్వారానే సమాజంపై సరైన అవగాహన కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చదువుకున్న యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ, పీడీఎస్ఈయూ, ఎన్ఎస్యూఐ, బీడీవీఎస్, వీవీఎస్, ఎన్ఎస్ఈ్యూ, బీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్