BREAKING
చక్రాయపాలెం గ్రామంలో పారిశుధ్యం పై అవగాహన కార్యక్రమం: ఏడాది గడిచినా చెల్లని విద్యుత్ బిల్లులు! • మధురాపురంలో కొండముచ్చుల భయం - పట్టించుకోని అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కరీంనగర్‌లో బైక్ దొంగ అరెస్ట్: మోటార్ సైకిల్ స్వాధీనం తాండూరు, బషీరాబాద్ పీఏసీఎస్‌లపై హైకోర్టు తీర్పు నేడే…! .16.24 కోట్లతో శింగనమలలో రహదారుల అభివృద్ధి పల్లె పండుగ 3.0 కింద సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం జంగంపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యమే లక్ష్యం: ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ నేడు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. త్రిపుర విలేజ్ కమిటీ ఎన్నికల ఫలితాలతో సీపీఎం-కాంగ్రెస్‌లను ప్రజలు తిరస్కరించినట్లు రుజువైంది: సీఎం మాణిక్ సాహా ‘జనసేవ నుంచి దేశసేవ వరకు’: ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు! వన్యప్రాణుల సంరక్షణపై అవగాహనకు 2కే రన్ ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు చెత్త బుట్టలో మృత శిశువులభ్యం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి: వాసిరెడ్డి సీతారామయ్య జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌లో మైథిలి సత్తా బంగారు పతకంతో మెరిసిన దాడితోట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

Select Suryaa Now
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి                     జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

 

వేములపల్లి, మేజర్ న్యూస్:                          ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండాఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన వేములపల్లి మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ వివరాలు, రోగుల రిజిస్ట్రేషన్, డెంగ్యూ, పాముకాటు కేసులు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, డ్రగ్స్ రిజిస్టర్ తదితరాలనుపరిశీలించారు.ఆసుపత్రిలోఎదురవుతున్నసమస్యలు,నమోదవుతున్నకేసులవివరాలనువైద్యాధికారిణి డా. సుచరితను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జలుబు, దగ్గు తదితర సీజనల్ వ్యాధుల కేసులుఎక్కువగావస్తున్నట్లు వైద్యాధికారిణి కలెక్టర్‌కు వివరించారు.అనంతరం ఆశా కార్యకర్తలతో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడుతెలుసుకోవాలని, ప్రతి ఆశా కార్యకర్త డైరీలో ప్రజల ఆరోగ్య సమస్యలు, గర్భిణులు, ముఖ్యమైన వివరాలను నమోదు చేసుకోవాలని, గర్భిణులను అవసరమైన సమయంలో ఏరియా ఆసుపత్రికి తరలించేలా ముందస్తుగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి అవకాశం లేకుండా గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమల నివారణకు పారిశుధ్య చర్యలు చేపట్టాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకుని ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యాధికారిణిని ఆదేశించారు.ఎల్ నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ప్రజలకు, అర్హులైన బాలికలకు అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్‌సీలోని అన్ని రిజిస్టర్లను, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ బహునూతుల హేమలత, ఇంచార్జీ ఎంపీడీవో జ్యోతి, హాస్పిటల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి. సుచరిత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎన్. ప్రవీణ్, సూపర్వైజర్ శాంతమ్మ, రికార్డ్ అసిస్టెంట్ బి. సోములు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.