BREAKING
చక్రాయపాలెం గ్రామంలో పారిశుధ్యం పై అవగాహన కార్యక్రమం: ఏడాది గడిచినా చెల్లని విద్యుత్ బిల్లులు! • మధురాపురంలో కొండముచ్చుల భయం - పట్టించుకోని అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కరీంనగర్‌లో బైక్ దొంగ అరెస్ట్: మోటార్ సైకిల్ స్వాధీనం తాండూరు, బషీరాబాద్ పీఏసీఎస్‌లపై హైకోర్టు తీర్పు నేడే…! .16.24 కోట్లతో శింగనమలలో రహదారుల అభివృద్ధి పల్లె పండుగ 3.0 కింద సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం జంగంపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యమే లక్ష్యం: ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ నేడు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. త్రిపుర విలేజ్ కమిటీ ఎన్నికల ఫలితాలతో సీపీఎం-కాంగ్రెస్‌లను ప్రజలు తిరస్కరించినట్లు రుజువైంది: సీఎం మాణిక్ సాహా ‘జనసేవ నుంచి దేశసేవ వరకు’: ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు! వన్యప్రాణుల సంరక్షణపై అవగాహనకు 2కే రన్ ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు చెత్త బుట్టలో మృత శిశువులభ్యం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి: వాసిరెడ్డి సీతారామయ్య జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌లో మైథిలి సత్తా బంగారు పతకంతో మెరిసిన దాడితోట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని

మధురాపురంలో కొండముచ్చుల భయం - పట్టించుకోని అధికారులు

Select Suryaa Now
మధురాపురంలో కొండముచ్చుల భయం - పట్టించుకోని అధికారులు

 

అధికారులు స్పందిస్తారా? మధురాపురంలో కొండముచ్చుల దాడులతో వణుకుతున్న జనం….

ఫరూక్ నగర్ మండలం మధురాపురం గ్రామస్తులను కొండముచ్చుల భయం వెంటాడుతోంది. నిత్యం కొండముచ్చులు గ్రామంలోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బుధవారం కొమ్మగంటి పరందాములు, పార్వతమ్మ అనే ఇద్దరిపై కొండముచ్చులు దాడి చేసి గాయపరిచాయి. దీంతో గ్రామంలో భయాందోళనలు మరింత పెరిగాయి. గతంలోనూ ఇలాంటి ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇంటి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి వస్తాయో తెలియక ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

కొండముచ్చులను పట్టుకునేందుకు అటవీ శాఖ  ప్రత్యేక నిపుణుల బృందం వారిని రప్పించి గ్రామం నుంచి తరలిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.

 

M. నరసింహ రెడ్డి , మేజర్ న్యూస్, ఫరూక్ నగర్….