BREAKING
నేడు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. త్రిపుర విలేజ్ కమిటీ ఎన్నికల ఫలితాలతో సీపీఎం-కాంగ్రెస్‌లను ప్రజలు తిరస్కరించినట్లు రుజువైంది: సీఎం మాణిక్ సాహా ‘జనసేవ నుంచి దేశసేవ వరకు’: ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు! వన్యప్రాణుల సంరక్షణపై అవగాహనకు 2కే రన్ ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు చెత్త బుట్టలో మృత శిశువులభ్యం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి: వాసిరెడ్డి సీతారామయ్య జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌లో మైథిలి సత్తా బంగారు పతకంతో మెరిసిన దాడితోట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని భారత పరివర్తనకు, పెరుగుతున్న ఆకాంక్షలకు నిదర్శనం: ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు! నేడు అమరచింతకు మంత్రి రాక.. ఆపరేషన్ నైట్ సేఫ్టీతో పోలీసుల నిఘా ముమ్మరం ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతే తొలి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ ఐటీ క్యూ2 ప్రివ్యూ: మందకొడిగా వృద్ధి, ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు.. టాప్ పిక్స్‌గా టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ: ఆనంద్ రాఠీ నివేదిక! టాటా సన్స్ లిస్టింగ్ వివాదం: వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లపై ఎస్‌డీటీటీ ట్రస్టీల తీవ్ర ఆగ్రహం.. బోర్డు తీర్మానాలను ఉల్లంఘించారని ఆరోపణ! తగ్గిన చమురు ధరలు, బాండ్ ఈల్డ్స్: లాభాల్లో దూసుకుపోతున్న అమెరికా స్టాక్ మార్కెట్లు.. ఎస్ అండ్ పీ, నాస్‌డాక్ జంప్! చౌకైన మ్యాక్‌కూ అత్యంత ఖరీదైన డివైజ్‌ల స్థాయి ప్రాధాన్యత: యాపిల్ సీఈవో జాన్ టెర్నస్ కీలక వ్యాఖ్యలు!

జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌లో మైథిలి సత్తా బంగారు పతకంతో మెరిసిన దాడితోట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని

Select Suryaa Now
జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌లో మైథిలి సత్తా  బంగారు పతకంతో మెరిసిన దాడితోట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని

అనంతపురం బ్యూరో : గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి సత్తా చాటింది. తాడిమర్రి మండలం దాడితోట జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వి. మైథిలి జాతీయస్థాయి సబ్‌జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

గత నెలలో మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన సబ్‌జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో మైథిలి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని జిల్లా సాఫ్ట్‌బాల్ అధ్యక్ష, కార్యదర్శులు గాయత్రి, గంగమ్మ తెలిపారు.

ఘనంగా సన్మానం

జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించిన మైథిలిని మంగళవారం ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ ఘనంగా సన్మానించి అభినందించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి జాతీయస్థాయిలో ప్రతిభ చాటడం అభినందనీయమని, క్రీడల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడి అభినందనలు

మైథిలి సాధించిన విజయంపై దాడితోట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమామహేష్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మైథిలి విజయం పాఠశాలకు, తాడిమర్రి మండలానికి గర్వకారణమని అన్నారు.

ఈ అభినందన కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సీఈవో సి. వెంకటేశులు, పీడీ జయలక్ష్మి, కాంతమ్మ, సీనియర్ క్రీడాకారుడు సింహాద్రి తదితరులు పాల్గొని మైథిలిని ప్రత్యేకంగా అభినందించారు.

జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించిన మైథిలి.. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికపై కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించి మరిన్ని పతకాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.