BREAKING
నేడు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. త్రిపుర విలేజ్ కమిటీ ఎన్నికల ఫలితాలతో సీపీఎం-కాంగ్రెస్‌లను ప్రజలు తిరస్కరించినట్లు రుజువైంది: సీఎం మాణిక్ సాహా ‘జనసేవ నుంచి దేశసేవ వరకు’: ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు! వన్యప్రాణుల సంరక్షణపై అవగాహనకు 2కే రన్ ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు చెత్త బుట్టలో మృత శిశువులభ్యం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి: వాసిరెడ్డి సీతారామయ్య జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌లో మైథిలి సత్తా బంగారు పతకంతో మెరిసిన దాడితోట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని భారత పరివర్తనకు, పెరుగుతున్న ఆకాంక్షలకు నిదర్శనం: ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు! నేడు అమరచింతకు మంత్రి రాక.. ఆపరేషన్ నైట్ సేఫ్టీతో పోలీసుల నిఘా ముమ్మరం ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతే తొలి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ ఐటీ క్యూ2 ప్రివ్యూ: మందకొడిగా వృద్ధి, ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు.. టాప్ పిక్స్‌గా టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ: ఆనంద్ రాఠీ నివేదిక! టాటా సన్స్ లిస్టింగ్ వివాదం: వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లపై ఎస్‌డీటీటీ ట్రస్టీల తీవ్ర ఆగ్రహం.. బోర్డు తీర్మానాలను ఉల్లంఘించారని ఆరోపణ! తగ్గిన చమురు ధరలు, బాండ్ ఈల్డ్స్: లాభాల్లో దూసుకుపోతున్న అమెరికా స్టాక్ మార్కెట్లు.. ఎస్ అండ్ పీ, నాస్‌డాక్ జంప్! చౌకైన మ్యాక్‌కూ అత్యంత ఖరీదైన డివైజ్‌ల స్థాయి ప్రాధాన్యత: యాపిల్ సీఈవో జాన్ టెర్నస్ కీలక వ్యాఖ్యలు!

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి: వాసిరెడ్డి సీతారామయ్య

Select Suryaa Now
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి: వాసిరెడ్డి సీతారామయ్య

 

సూర్య, మంచిర్యాల: 

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ సంస్థను పరిరక్షించి మరింత బలోపేతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో గేట్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల హక్కులు, ఉద్యోగ భద్రత, వేతనాలు, సంక్షేమం కోసం ఎంప్లాయిస్ యూనియన్ నిరంతరం పోరాడుతోందని ఆయన పేర్కొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు ఎంప్లాయిస్ యూనియన్ బస్సు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాగే టీఎంయూ యూనియన్ నిచ్చెన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

కార్మికుల సమస్యలు ఎదురైన సమయంలో పట్టించుకోకుండా స్వప్రయోజనాల కోసం వివిధ పార్టీల వైపు వెళ్లే వారిని గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు తిరస్కరించాలని సీతారామయ్య అన్నారు. కార్మిక వర్గ ప్రయోజనాల కోసం నిబద్ధతతో పనిచేసే సంఘాలకు మద్దతు ఇవ్వాలని సూచించారు.

ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన సంస్థ అని, దానిని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లకుండా ప్రభుత్వం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగులకు భద్రత కల్పించడంతో పాటు సంస్థను మరింత పటిష్టం చేయవచ్చని పేర్కొన్నారు.

గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు తమ హక్కులు, సమస్యలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే. వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, ఎస్.కే. బాజీ సైదా, కలిందర్ అలీ ఖాన్, జోగుల మల్లయ్య, లింగం రవి, సలేంద్ర సత్యనారాయణ, భీమనాదుని సుదర్శన్, దాగం మల్లేష్, ధోనికేన సమ్మయ్య, ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ అధ్యక్షుడు మామిడిపల్లి శ్రీనివాస్, డిపో అధ్యక్ష, కార్యదర్శులు రాజేశం, గోలి శంకర్, బొట్టు లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.