BREAKING
నేడు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. త్రిపుర విలేజ్ కమిటీ ఎన్నికల ఫలితాలతో సీపీఎం-కాంగ్రెస్‌లను ప్రజలు తిరస్కరించినట్లు రుజువైంది: సీఎం మాణిక్ సాహా ‘జనసేవ నుంచి దేశసేవ వరకు’: ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు! వన్యప్రాణుల సంరక్షణపై అవగాహనకు 2కే రన్ ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు చెత్త బుట్టలో మృత శిశువులభ్యం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి: వాసిరెడ్డి సీతారామయ్య జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌లో మైథిలి సత్తా బంగారు పతకంతో మెరిసిన దాడితోట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని భారత పరివర్తనకు, పెరుగుతున్న ఆకాంక్షలకు నిదర్శనం: ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు! నేడు అమరచింతకు మంత్రి రాక.. ఆపరేషన్ నైట్ సేఫ్టీతో పోలీసుల నిఘా ముమ్మరం ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతే తొలి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ ఐటీ క్యూ2 ప్రివ్యూ: మందకొడిగా వృద్ధి, ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు.. టాప్ పిక్స్‌గా టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ: ఆనంద్ రాఠీ నివేదిక! టాటా సన్స్ లిస్టింగ్ వివాదం: వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లపై ఎస్‌డీటీటీ ట్రస్టీల తీవ్ర ఆగ్రహం.. బోర్డు తీర్మానాలను ఉల్లంఘించారని ఆరోపణ! తగ్గిన చమురు ధరలు, బాండ్ ఈల్డ్స్: లాభాల్లో దూసుకుపోతున్న అమెరికా స్టాక్ మార్కెట్లు.. ఎస్ అండ్ పీ, నాస్‌డాక్ జంప్! చౌకైన మ్యాక్‌కూ అత్యంత ఖరీదైన డివైజ్‌ల స్థాయి ప్రాధాన్యత: యాపిల్ సీఈవో జాన్ టెర్నస్ కీలక వ్యాఖ్యలు!

ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

 

సంప్రదాయ దుస్తుల్లో అలరించిన విద్యార్థినులు.. రావణ దహనం చేసిన నరేందర్ రెడ్డి

సూర్య, మంచిర్యాల: ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో పాఠశాల ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అనంతరం బతుకమ్మలను చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, పాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్బంగా ఆల్ఫోర్స్  అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని  పేర్కొన్నారు. విద్యార్థుల్లో మన సంస్కృతి, పండుగల పట్ల అవగాహనతో పాటు ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

వేడుకల్లో భాగంగా రావణ దహనం కార్యక్రమాన్ని నరేందర్ రెడ్డి నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.పాఠశాల ఆవరణలో బతుకమ్మ వేడుకలతో పాటు రావణ దహనం కార్యక్రమం నిర్వహించడంతో విద్యార్థుల్లో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.