దసరా నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
దసరా నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను మండపాల నిర్వహకులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మీనారాయణ రెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధిలో దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేవి నవరాత్రి వేడుకల సమయంలో నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేసుకోవాలని, శాంతి సామరస్యాలను కాపాడుతూ, అన్ని భద్రత, శాంతి భద్రతల మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. నిర్వాహకులు, భక్తులు అధికారులకు సహకరించి, శాంతియుతంగా సురక్షితంగా దసరా నవరాత్రి వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పహాడీ షరీఫ్ ఎస్సైలు, మండపాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
- అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.